Sri Kaaryasiddhi Abhyanjaneya Swami Temple – Nellore, Balaji Nagar.

Sri Kaaryasiddhi Abhyanjaneya Swami Temple – Nellore, Balaji Nagar.

Mandiram Entrance

మందిరం లోని వెనుక వైపు పంచముఖి ఆంజనేయస్వామి దగ్గర నిత్యం అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఎంతో మంది భక్తులు అఖండ దీపంలో నెయ్యి/నువ్వుల నూనె పోసి ప్రదక్షణాలు చేసిన తమ కోరికలు తీరునని నమ్ముతారు.

పంచముఖ ఆంజనేయస్వామి వద్ద దీపములు పెట్టి, నైవేద్యం సమర్పించి, ప్రదక్షణాలు చేసిన తమ క్లిష్ట సమస్యలు తొలుగునని నమ్ముతారు

SriRama Paduka pooja will performed here ( శ్రీరామ పాదుకా పూజలు నిర్వహిస్తారు).

పంచముఖ ఆంజనేయస్వామి వద్ద దీపములు పెట్టి, నైవేద్యం సమర్పించి, ప్రదక్షణాలు చేసిన తమ క్లిష్ట సమస్యలు తొలుగునని నమ్ముతారు

Activities in the Temple:

Regular Activities: Panchaamrutha abhishekam to Moola Virat on every tuesday, Vadamaala Pooja on every Tuesday and Saturday. Annaprasam on every Tuesday.

Activity 1: ఇక్కడ వైశాఖ మాసం లో, శ్రీరామనవమి తరువాత వచ్చు హనుమాన్ జయంతి చాలా విశేషంగా జరుగుతుంది. లక్ష తమలపాకులతో వందలాది మంది భక్తులందరి చేతుల మీదుగా రామనామం చేయుచూ ఆంజనేయ స్వామి పాదములను అర్చిస్తారు. ఈ పూజ విధానం కనుల విందులుగా ఉంటుంది. భక్తులు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ కార్యములో పాల్గొనుచూ ఉంటారు.

Activity 2: మార్గశిర మాసంలో వచ్చు హనుమత్ వ్రతం ఇక్కడ ఎంతో మంది భక్తులతో కలసి రామ భజనలు, వ్రత కథలతో చాలా విశేషముగా జరుపుకొంటారు

Activity 3 : శ్రీరామ నవమి : ఇక్కడ శ్రీరామ నవమి రోజున ఎంతో మంది భక్తులు దంపతులుగా వచ్చి సీతారామ కళ్యాణం జరుపుకుంటారు. అటు పిమ్మట అందరూ కలసి అన్నప్రసాదాలు స్వీకరిస్తారు

Activity 4: Monthly SriRama Naama Group Bhajans : శ్రీరామనామ భజన ఇక్కడ విశేషముగా మరి ఎక్కడా లేని విధముగా జరుగును. స్వయంగా ఆంజనేయ స్వామియే భజనకి వచ్చి భజన చేయు వారితో కలసి భజన చేయును.

Activity 5: ఫిబ్రవరి 9 వ తేదీ గురుదేవుల జన్మదినం రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది