Hanuma Bhoda -1
హనుమంతుని వాక్కు ద్వారా చెప్పబడిన వాక్యములు
ధర్మమును విడిచితిరి, ధనమును పట్టితిరి. దైవమును మరచితిరి, ధనమునకు చిక్కితిరి.
ధనమునే అధికముగా బావించు వారి చెంత, నేను ఉండగలనా? నువ్వు కోరినది ధనము, తీసుకొనుము. కానీ ఆ చోట నేను ఉండలేను నాయనా. నీ మనస్సు దేని కొరకు తపించునో అదే నేను ఇవ్వగలను నాయనా. నా యందు నీ మనసు లేనిచో, నా యందు నువ్వు నిలవలేవు నాయనా. నీ మనసు దేని మీద లగ్నము చేయునో అదే నీకు దక్కును నాయనా.
నరులకు ఏది అధికమైనను ధర్మానికి హాని జరుగును నాయనా. అధికమనే మాయలో పడి మీ బూ పరులు, అందలము ఎక్కి కూర్చో గలరు కానీ, నన్ను చేర గలరా?
