Gurudevula Paricheyam

Gurudevula Paricheyam

గురుదేవులు నెల్లూరు జిల్లా లోని జలదంకి గ్రామములో మస్తానమ్మా, వెనుకా రెడ్డి దంపతులకు జన్మించారు. తమ స్వగ్రామములోనే చిన్నతనములో విద్యనభ్యసించినారు.

పూర్వజన్మ సుకృతంతో చిన్నవయసు నుంచే గురుదేవులుకు ఆంజనేయస్వామి దర్శనం, ఆంజనేయస్వామితో సంభాషణం జరుగుతూ ఉండేది.

చిన్న వయసులోనే గురుదేవులు ఆంజనేయస్వామి తనకు కొన్ని జరగబోవు సంఘటనలు చెప్పినవి తమ తోటి వారికి చెప్పి వారికి మేలు చేసే వారు, ఆ క్రమములో కొందరి చేత అవమానములు కూడా ఎదుర్కోన్నారు.

యుక్త వయసు సమయమున గురుదేవులు శ్రీశైలం లోని భువనేశ్వరి దేవి ఉపాసకులు అయిన పూర్ణానంద స్వామిని సేవించి, విద్యనబ్యసించినారు. తమ గురువుల ఆదేశముతో వివాహం చేసుకుని రాజయోగమును పొందినారు.గురుదేవులు వివాహమైన తరువాత తాము నివసిస్తున్న నెల్లూరు లోని, బాలాజీనగర్ నందు శ్రీకార్యసిద్ధి అభయాంజనేయ స్వామి మందిరమును నిర్మించినారు.

గురుదేవులు ఎంతో మంది శిష్యులకు మంత్రోపదేశమును ఇచ్చి భక్తి యోగములను ప్రసాదించి వారి ద్వారా ఎన్నో దైవ, ధర్మ కార్యములను చేయిస్తూ ఉన్నారు.

గురుదేవుల శిష్యులలో గురుపరంపర యోగమును పొందిన వారు రాజుస్వామి, మనోహర స్వామి గురుదేవులు ఉన్నారు.

గురుపరంపర యోగమును పొందిన మనోహర స్వామి గురుదేవులు తమ యుక్త వయస్సు నుంచే, హైదరాబాద్ నగరమున రామనామ భజన మందిరమును ఏర్పరిచి, ఈ సన్నిధమునే భక్తి కేంద్రముగా చేసుకుని తమ శిష్యుల చేత ఎన్నో భజన కార్యములు, భక్తి కార్యములు, యజ్ఞములు, లోకకల్యాణ కార్యములు, సామాజిక సేవ కార్యములు చేయించుచూ ఉన్నారు.